దగ్గుబాటి హీరో మాస్టర్ ప్లాన్...

23 Apr 2015

దగ్గుబాటి కుటుంబం నుండి విక్టరీ వెంకటేష్ తరవాత మరో స్టార్ హీరో ఎవరు అన్న ప్రశ్న దగ్గుబాటి అభిమానులను ఆలోచనలో పడేస్తుంది. చాలా వరకు వెంకటేష్ బాబు కొడుకు అర్జున్ లైన్ కు వచ్చే వరకు ఆ ప్లేస్ ఖాళీనే అనుకుంటున్నారు. కాని రానా బాబు ఆ ప్లేస్ కోసం తన ప్రయత్నంలో తానూ ఉన్నాడని కొన్ని సంకేతాలు అందుతున్నాయి.
 
రానా బాబు మంచి సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యాడు. కాని అనుకున్నంత బ్రేక్ రాలేదు. సోలో గా రానాను తెలుగులో చూడటం కష్టం అనే వర్డ్ స్ప్రెడ్ అయ్యింది. కాని రానా మాత్రం తెలివిగా పావులు కదుపుతూ.. ఏ బాషలో.. ఎంత చిన్న అవకాశం వచ్చిన వదలకుండా చేసుకుపోతున్నాడు. అలా చేసుకుంటూ వెళ్ళటం వెనుక ఓ పెద్ద ప్లాన్ ఉంది అని కొన్ని విశ్లేషణలు సాగుతున్నాయి. బాహుబలి విడుదల తరవాత ఆ ప్లాన్ అమలు చేయటం మొదలు పెడతాడు రానా అంటున్నారు.
 
మేటర్ ఏమి అంటే.. బాహుబలి తరవాత రానాకు ఆ సినిమా విడదలైన అన్ని బాషల్లోను.. మంచి పేరు రావటం ఖాయం అని ఒక అంచనా..! అదేకనుక జరిగితే.. అప్పుడు రానా సోలో హీరోగా సినిమా చేస్తాడు. దానిని తానూ పరిచయం ఉన్న అన్ని బాషల్లోను విడుదల చేస్తారు. ఆ పై సినిమా క్లిక్ అయితే... అన్ని బాషల్లోను రానాకు మార్కెట్ క్రియేట్ అవుతుంది. ఇది ప్లాన్..! ఈ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో.. చూడాలి..!