తెలుగు హీరోలకు ఇగో ఎక్కువట..!

28 Apr 2015

తెలుగు హీరోలకు ఇగో ఎక్కువట.. ఈ మాట అంది మాములు మనిషి కాదు. ఒక పెద్ద నిర్మాత. అదెలా సాద్యం..  తెలుగు సినిమా పెద్ద నిర్మాతలకు హీరోల పై మాట పెగిలే ధైర్యం ఎక్కడ ఉంది అని అని మీరు ఆశ్చర్యపడిపోవద్దు. ఎందుకంటే.. ఈ మాటలన్నది పెద్ద నిర్మాతే కాని.. పెద్ద హీరోల నిర్మాత కాదు.
ఇంతకీ ఆయన ఎవరు అంటే.. సి కళ్యాణ్. తాజాగా ఆయన కమల్ హసన్ తమిళంలో నటించిన ‘ఉత్తమ విలన్’ ను తెలుగులోకి అనువదించి విడుదల చేస్తున్నాడు. ఆ సినిమా కోసం ప్రచారం చేసే పనిలో బాగంగా ఈ మధ్య కొంచెం మీడియాతో తరచుగా మాట్లాడుతున్నారు. ఆ క్రమంలోనే మాటల మద్య ఆయన తెలుగు హీరోలకు ఇగో బాగా ఎక్కువ అని కామెంట్ చేశాడు. అందుకు అయన కొంత వివరణ కూడా ఇచ్చారు.
తెలుగులో దాదాపు పెద్ద హీరోలందరికి ఇగోనే..! దాదాపు అందరు సినిమాలు చేసి పక్కకు తప్పుకుంటారు కాని ప్రచారానికి మాత్రం రారు. చాలా తక్కువగా  మాత్రమే ప్రచారంలో పాల్గొంటారు. కాని సినిమా నిలబడాలి అంటే.. అది సరిపోదు. ఈ విషయంగా వాళ్ళను అడిగే వాళ్ళు లేరు…! వాళ్ళకి పట్టదు..! ఇలా అయితే పరిశ్రమ అభివృద్ధి కష్టం.. అని అనేశాడు. మరీ ఈయన మాటల పై ఎవరైనా స్పందిస్తారో.. లేదో.. చూడాలి.