చరణ్ బాబు కామెడీ

24 Apr 2015

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాస్ ప్రేక్షకుల మారాజు. తెలుగు మాస్ జనాలలో తనకున్న ఇమేజ్ బేస్ గా టాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఇప్పటికే దూసుకుపోతున్న చెర్రి బాబు మెగాస్టార్ లాగా నంబర్ 1 అనిపించుకోవాలని తెగ ఉబలాట పడుతున్నాడు. ఆ క్రమంలోనే ఇప్పుడీ కామెడీ హడావిడ్..!
 
రామ్ చరణ్ డాన్సులు గురించి అడగండి.. ఆపకుండా ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు కోకొల్లలు..! ఫైట్స్ గురించి అడగండి..గుక్క తిప్పుకోకుండా మాట్లాడేవాళ్ళు చాలామంది.. చరణ్ స్టైల్ గురించి అడక్కుండానే చెప్పేవాళ్ళును లెక్కపెట్టటం కష్టం.. ! కాని చరణ్ యాక్టింగ్ గురించి అడిగితే.. ఆడిపోసుకునే వాళ్ళు.. నీళ్ళు నమిలే వాళ్ళే ఎక్కువ. ఇలాంటి వాళ్ళకు సమాధానం చెప్పే ప్రయత్నమే.. శ్రీను వైట్లతో తానూ చేస్తున్న కొత్త చిత్రంతో చేయబొతున్నాడని తెలుస్తుంది.
 
స్టైల్, డాన్సు, ఫైట్స్ తరవాత మెగాస్టార్ చిరంజీవి చేసే కామెడీ అంటేనే అభిమానులకు మహాపిచ్చి..! ఇప్పుడు తండ్రి తరహాలో కామెడీ చేసి రామ్ చరణ్ మంచి నటుడు కూడా అనిపించేసుకుంటే.. నంబర్ 1 ప్లేస్ కు చెక్ పెట్టేయవచ్చు అని చెర్రి ప్లాన్ వేశాడు అని తెలుస్తుంది. చరణ్ ప్లాన్ కు అనుగుణంగానే శ్రీను వైట్ల ఈ సినిమాను డిజైన్ చేస్తున్నాడంటా..! చూద్దాం  మరీ.. చరణ్ కోరిక ఎంతవరకు నెరవేరుతుందో..?