చిరంజీవిని మర్చిపోతున్నారు.. ?

12 Apr 2015

చిరంజీవి అంటే ఒక ప్రకంపనం..  మెగాస్టార్ అంటే ఒక సంచలనం.. మెగాస్టార్ చిరంజీవి అంటే.. ఒక ప్రభంజనం..! చిరంజీవి మాట కోసం.. డాన్సులకోసం జనాలు పరితపించిపోతారు. చిరంజీవిని చూస్తే చాలు పరవశించి పోతారు. కాని ఈ మాటలు ఒకప్పటి చిరంజీవి గురించి..!  ఒకప్పటి ఎందుకంటే.. ఆయన కోసం పరితపించే వాళ్ళ సంఖ్య ప్రస్తుతం క్రమంగా తగ్గుకుంటూ పోతుంది కాబట్టి..!
 
ఒక సర్వే ప్రకారం.. యూత్ లో మెగాస్టార్ చిరంజీవిని ఇష్టపడేవాళ్ళు బాగా తగ్గుతూ వస్తున్నారని అంచనా..! అందుకు కొన్ని లాజికల్ ఆధారాలు కూడా కనపడుతున్నాయి. ఒక పది సంవత్సరాల క్రితం వరకు మెగాస్టార్ చిరంజీవిని అభిమానించే వాళ్ళ సంఖ్య ఘనంగానే ఉండేది. అప్పటివరకు ఆయనను అభిమానించే వాళ్ళు ఇప్పటికి కంటిన్యూ అవుతున్నారు. కాని కొత్తగా యువకులు అవుతున్న వాళ్ళు మాత్రం చిరంజీవిగారి అభిమానులుగా మారే అవకాశాన్ని తీసుకోవటంలేదు. సినిమాలు మానేసి రాజకీయాలలోకి వెళ్లి.. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుని చాలా ఇమేజ్ డామేజ్ చేసుకున్నారు చిరంజీవి.
 
అలానే సినిమాలు చేయకపోవటం మూలంగా యూత్ కు చిరంజీవి ఒకప్పటి హీరో అన్న ఆలోచననే ఇచ్చారు. ఫలితంగా ఆయనకు పాత అభిమానులే కాని కొత్త వాళ్ళు పెరుగుతున్న పరిస్థితి కనిపించటంలేదు. మెగాఫ్యామిలీ లో ఉన్న అందరు హీరోలు సినిమాలు చేస్తూ.. కొత్త కొత్త అభిమానులను ఏర్పరుచుకుంటున్నారు. చిరంజీవి కూడా 150వ సినిమా చేస్తే.. తప్పకుండా ఈ సమస్యను అదిగమిస్తారు అని చెప్పుకొస్తున్నారు సీనియర్ మోస్ట్ మెగా అభిమానులు.  మరి ఈ సంగతి ఎంతవరకు సాధ్యపడుద్దో.. వేచి చూడాలి..!