చిరంజీవి 150కి దర్శకుడు దొరికాడు..!

13 Apr 2015

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందా? రాదా? అన్న సంగతి ఎలా అయితే.. కర్ర విరగదు.. పాము చావదు.. అన్న చందంగా నడుస్తుందో.. చిరంజీవి 150వ సినిమా కూడా అదే ఫక్కీలో అటు ఇటు ఊగులాడుతుంది. అదిగో మొదలు.. ఇదిగో మొదలు.. అని ఎప్పుడూ ఊరించటం.. ఉసూరుమనిపించటం.. మెగా క్యాంప్ కు మాములు అయిపొయింది. ఆ పరంపరలోనే తాజాగా మరోసారి చిరంజీవి 150 వ సినిమా మళ్లీ తెరపైకి వచ్చింది.
 
గత సంవత్సరం చెప్పినట్టుగానే.. ఇప్పుడు కూడా చిరంజీవి పుట్టిన రోజు కానుకగా ఆగష్టు నెలలో 150 వ సినిమా మొదలవుతుందని వార్త పచార్లు మొదలుపెట్టింది. పొతే క్రిందటి సంవత్సరం దర్శకుడు ఎవరు అనే విషయంగా స్పష్టత లేదు. కాని ఈసారి పూరి జగన్నాథ్ మెగాస్టార్ అభిమానుల దీర్ఘకాల కోరికను తీర్చే అవకాశాన్ని దక్కించుకున్నాడు అని ప్రచారం జరుగుతుంది. ఈ సమాచారంగా ఎటువంటి అధికారిక దృవీకరణలు లేవుకాని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పూరినే దర్శకుడిగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయని పెద్దలు మాట్లాడుకుంటున్నారు.
 
టెంపర్ సినిమా విజయం తరవాత చిరంజీవితో 'ఆటో జానీ' అనే సినిమా తీసే ఉద్దేశం ఉందని ప్రకటించాడు పూరి. ఆ నేపద్యంలో చిరంజీవి 150వ సినిమా దర్శకుడిగా పూరి పేరు బయటకు రావటం విశేషమనే మాట్లాడాలి. కాకపోతే పూరి కధ కాకుండా చిరంజీవి ఎంపిక చూసుకున్న కధతో సినిమా ఉండొచ్చు అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి..  ఏం జరుగుతుందో..?