ఛార్మి పెళ్లి ఎవరికీ పట్టలేదు.. !

13 Apr 2015

చార్మికి పెళ్లైంది..! పెళ్లి కూతురిగా ముస్తాబై ఉన్న ఫోటోను అభిమానులు చూసేలా సోషల్ వెబ్ సైట్ పెట్టింది. అంతలా తన ఉత్సాహాన్ని ఛార్మి పంచుకుంటే.. అవునా..  అన్న నాదుడు కాని.. సర్లే.. అన్న మంచోడు కాని ఒక్కడైన కనపడలేదంటా..! దాంతో విపరీతమైన నిరుత్సాహం వచ్చి ఛార్మి పూరి జగన్నాథ్ కు చెప్పుకుని భాధపడిందంటా..!
 
ఇంతకీ నిజంగానే చార్మికి పెళ్లి అయ్యిందా..? అని అనుమానపడొద్దు.. ! చార్మిని అప్పుడే పెళ్లి ఎవరు చేసుకుంటారు..? ఇప్పుడు ఆమెకు మంచి సినిమాలు లేవు.. మిగత హీరోయిన్స్ కు ఉన్నంత బ్యాంకు బాలెన్సులు లేవు..! సినిమాలు రావటంలేదని బెంగపడిన చార్మిని పూరి జగన్నాథ్ ఓదార్చే కార్యక్రమం చేపట్టాడు.. దాని ఫలితమే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి హీరోగా (లేడి ఓరియంటెడ్) మొదలైన జ్యోతిలక్ష్మి సినిమా. ఈ సినిమాకు ఛార్మి కూడా ఒక నిర్మాత.
 
అందుకని కేవలం నటించటమే కాకుండా సినిమాను ప్రచారం చేసే భాద్యతను కూడా రక్తికట్టించే ప్రయత్నాలు చేస్తుంది. అందులో బాగమే పెళ్ళికూతురు గెట్ అప్ ఫోటో..! ఆ ఫోటో పెట్టి నా పెళ్లి అని రాసుకొచ్చింది.. కాసేపటికే.. కాదు..  కాదు.. తమాషకి.. ఇది జ్యోతి లక్ష్మి సినిమాలో ఫోటో.. అని చెప్పుకొచ్చింది. జనాలు కూడా ఈ విషయాన్ని చూసి చూడనట్టుగా వదిలేసి.. చార్మితో చతురు ఆడారు..! దాంతో జనాలలో  తనకు తగ్గిపోతున్న క్రేజ్ ను తలచుకుని భాదపడాల్సిన పరిస్థితి వచ్చింది.