చరణ్ కు అక్కైనా బాగ్యమేనట..!

22 Apr 2015

స్టార్ హీరోతో సాంగత్యం అంటే.. మాములు విషయం కాదు..! స్టార్ హీరో చేస్తున్న సినిమాలో చేయటం అంటే.. ఆ ట్రీట్ మెంటే వేరు... ఆ భోగం.. వైభోగం.. అబ్బో.. అనుభవించాలే కాని చెప్పేది కాదు. అలానే డబ్బుకు కొదవ ఉండదు.. సినిమా బయటకు వచ్చాకా పేరుకు కొదవ ఉండదు. అందుకని.. స్టార్ హీరోతో సినిమా అంటే.. ఎన్ని నిబందనలైన పక్కన పడిపోతాయి..!
 
అందుకు బోల్డన్ని నిదర్శనాలు.. చిన్న సినిమాల్లో హీరోయిన్స్ గా చేసేవాళ్ళు పెద్ద హీరోలకు చెల్లెళ్ళగా అక్కలుగా నటించటం ఇంతకు ముందు చూశాం.. ఇప్పుడూ చూస్తున్నాం. వాళ్ళే కాదు అవకాశాలు తగ్గిపోయిన స్టార్ హీరోయిన్లు కూడా అక్కగానో .. చెల్లిగానో.. అమ్మగానో.. అవతారాలు ఎత్తిన ఉదంతాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ కోవలోనే పవన్ కళ్యాణ్ హీరోయిన్ చెర్రి బాబుకు అక్కగా నటిస్తూ.. తప్పేముంది? ఇది అవకాశమేగా అంటుంది.
 
పవన్ కళ్యాణ్ తో కలిసి తీన్ మార్ సినిమాలో నటించిన బెంగుళూరు భామ కృతి కర్బందా...  రామ్ చరణ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో హీరో అక్కగా కనిపిస్తుంది. హీరోయిన్ గా కన్నడలో ఒక మాదిరి ఫామ్ లో ఉన్న మీరు అక్కగా నటించటం ఏమిటి అని అడిగితే.. తప్పేముంది.. ఆ పాత్రకు సినిమాలో చాలా ప్రముఖ్యత ఉంది... అయినా అది కూడా అవకాశమే కదా.. అని ఏదో గొప్ప పని చేస్తున్నట్టు ఫీలింగ్ చూపించిందట..! అంతేలే.. డబ్బులు ఎక్కువ ఇస్తున్నప్పుడు.. అలానే అనిపిస్తుంది అని అనుకుంటున్నారు లోకులు..!