బన్నీకి కాదు.. చైతుకు చెక్..!

19 Apr 2015

అల్లు అర్జున్ S/O సత్యమూర్తి సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. బన్ని స్టైల్ మ్యాజిక్.. త్రివిక్రమ్ మాటల మాయ కలిసొచ్చి.. ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ఈ సినిమా కలక్షన్ల ప్రవాహానికి మార్కెట్ లో మరో మంచి సినిమా లేకపోవటం అనే కారణం కూడా ఒకటి ఉంది.. మొదటి వారం క్రేజ్ తో నడిచిపోయినా.. రెండో వారం పోటికి సరైన సినిమా వస్తే కలక్షన్లలో తేడా వస్తుందని ట్రేడ్ భావించింది.
 
ఆ ప్రకారమే.. రెండో వారంలో ఓకే బంగారం కారణంగా క్లాస్స్ ఏరియాస్ లో.. లారెన్స్ గంగ మూలంగా మాస్ ఏరియాస్ లో సత్యమూర్తి కొడుకుకు పోటి వస్తుందనుకున్నారు. అలానే ఓకే బంగారం మూలంగా క్లాస్ ప్రాంతాలలో కొంత తేడా కనిపించినప్పటికీ మంచి దియేటర్స్ చేతిలో ఉండటంతో పెద్దగా ఇబ్బంది పడలేదు. ఇక గంగ సినిమా బెల్లంకొండ ఓవర్ యాక్షన్ మూలంగా వస్తుంది.. వస్తుంది.. అంటూ ఆఖరి నిమిషంలో రాలేదు. దాంతో గంగ కోసం ఎదురుచూసిన అభిమానులు మళ్లీ S/O సత్యమూర్తి చూస్తూ రిలాక్స్ అవుతున్నారు. అలా పోటి అవుతుంది అనుకున్న సినిమా కలిసోచ్చేసింది.
 
గంగ వచ్చే వారం వస్తుంది. అప్పుడు S/O సత్యమూర్తికి పోటి అయ్యే అవకాశం లేదు... కాని చిన్న బాబు నాగచైతన్యకు అడ్డం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తమిళంలో ఈ వారమే విడుదలైన గంగ మాస్ హిట్ గా నిలిచింది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులను కూడా అలరించే అవకాశం ఉంది అంటున్నారు. చూడాలి మరి.. గంగ పోటీని తట్టుకుని నాగచైతన్య ప్రేక్షకుల మనసులను ఎలా దోచుకుంటాడో..!