బన్నీబాబు రికార్డుల వెర్రి..!

5 Apr 2015

తెలుగు సినిమాలలో స్టార్ హీరో అనిపించుకున్నాక రికార్డులు కావాలి అని వెర్రెత్తి పోవటం సహజం. హీరోలకు మొత్తంగా లేకపోయినా.. ఆయనతో ఉండే తోకలకు, కింద పనిచేసే మూకలకు, అమాయకులైన అభిమానులకు అవి బాగా అవసరం. ఎంత చిన్న విషయమైన రికార్డ్ వస్తుంది అంటే.. వెంపర్లాడి పోవటం సినిమా జనాలకు కామన్ అయిపొయింది. ఇప్పుడు స్టైలిష్ స్టార్ బన్నీ ఓక కొత్త రికార్డ్ కోసం ఉవ్విళ్ళు ఉరుతున్నారు.
 
ఇప్పుడిప్పుడే టాలీవుడ్ బాక్స్ ఆఫీసు లో తనకంటూ కొన్ని రికార్డులను రాసుకుంటున్న అల్లు అర్జున్ చాలా కాలంగా సోషల్ నెట్ వర్క్ మీడియంలో మాత్రం చాలా రికార్డులను తన పేర లిఖించుకున్నాడు. మిగత తెలుగు హీరోలతో పోల్చుకుంటే.. పేస్ బుక్ లో చాలా రికార్డులు బన్ని పేరుమీదే ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం అతని దగ్గర పనిచేసే వాళ్ళు సోషల్ నెట్ వర్క్ మీద మంచి పట్టు కలిగి ఉండటమే..! ప్రస్తుతానికి పేస్ బుక్ మీద పెత్తనం చెలాయిస్తున్న బన్ని ఇక పై ట్విట్టర్ లో కూడా ఆధిపత్యం చేయాలని డిసైడ్ అయ్యాడు. అందుకు రేపు ఏప్రిల్ 8, తన పుట్టిన రోజును ముహూర్తంగా ఎంచుకున్నాడు. ఆ రోజు ఉదయం 8 గంటలకు బన్ని ట్విట్టర్ ప్రవేశం జరగనుంది.
 
ఇక్కడి వరకు బానే ఉంది.. కానీ ఈలోపు ఎవ్వరు కూడా ఆయన్ని ఫాలో అవకూడదు అని ఒక ఆజ్ఞ. నిర్ణయించిన ముహూర్తం తరవాతే అందరు ఎగబడాలి అని అనా..! అలాంటప్పుడు ముందే చెప్పటం ఎందుకు.. అదేదో ఆరోజే ఏడవొచ్చుగా అని కొంతమంది నిరాశపడుతున్నారు. పొతే ఇలా కంట్రోల్ చేయటం వెనుక రికార్డుల తీటే కారణం అని కొంతమంది విమర్శిస్తున్నారు. ముందే చెప్పేస్తే.. ఆ టైంకి ఒక్కసారిగా జనాలు ఎగబడతారు.. అప్పుడు గంటలో ఇంతమంది ఫాలో అయ్యారు.. ఆ తరవాత అంతమంది వచ్చారు.. ఈ రికార్డు ఆ రికార్డు అని డబ్బా కొట్టుకోవచ్చు అని వాళ్ళ ప్లాన్ అని చెప్పుకుంటున్నారు.