బన్ని 30 సెకన్లు ముద్దు..!

8 Apr 2015

బాలీవుడ్ లో ఇమ్రాన్ హస్మి.. తెలుగులో అల్లు అర్జున్ సిరియల్ కిస్సర్స్ గా పేరు మోస్తున్నారు. ఇమ్రాన్ బాహాటంగానే నేను ముద్దుల వీరుణ్ణి అని ప్రకటించుకున్నాడు.. కాని బన్ని బాబు అలా కాదు దాదాపు తనతో చేసిన అందరి హీరోయిన్స్ తో మూతి ముద్దులు పుచ్చుకున్నాడు కాని.. ముద్దుల వీరుణ్ణి అని ఒప్పుకోడు..! ఎందుకంటే.. సన్నివేశం డిమాండ్ చేయకుండా నేను ఒక్క ముద్దు కూడా పెట్టుకోలేదు.. అది వృత్తి ధర్మం అని దబాయిస్తున్నాడు.
 
ఇప్పుడు కూడా అలా దబాయిస్తూనే.. త్రివిక్రమ్ లాంటి ఉత్తముణ్ణి కూడా పాడు చేసి s/o సత్యమూర్తి సినిమాలో ఒక లిప్ ముద్దు లాగించేసాడు. ఆ సినిమాలో అదా శర్మ తో ఒక 30 సెకన్ల ముద్దు సీన్ ను గొప్పగా పండించాడంటా..! సీన్ బాగా వచ్చింది.. అంతా బాగుంది.. అనుకున్నారంటా..! కాని మనకి మాత్రం ఆ ముద్దు చూసే అదృష్టంలేదు.. ఎందుకంటే.. ఏమైందో.. ఏమో కాని సినిమాను సెన్సార్ కు పంపే ముందు త్రివిక్రమ్ మనసు ఒప్పుకోక.. ఆ ముద్దును తిసేశారంటా..!
 
అలా మన టాలీవుడ్ ముద్దుల వీరుడు తన ముచ్చటైతే.. తీర్చుకున్నాడుకాని ప్రేక్షకులను మాత్రం నిరాశపరుస్తున్నాడు..! పొతే ఆ ముద్దు సీన్ తిసేసినవాళ్లు.. ఆ విషయాన్నీ బయటకు చెప్పకపోతే.. ఎవరేమన్నారు..? ప్రచారం కోసం పనికొస్తుందిలే.. అని వదిలారు.. అనుకున్నట్టు ఇక్కడా వాళ్ళ కోరిక తీరి ప్రచారం బాగానే జరుగుతుంది.. కాని జనాలే ముద్దును చూడలేకపోతున్నామే.. అని ఉసూరుమంటున్నారు..!