బాలయ్య హీరోయిన్ బలుపు

4 Apr 2015

అరె.. బాగుందిలే.. చక్కగా చేసిందిలే అని రెండు సినిమాలు ఇస్తే.. పనిచేసుకుని చక్కగా వెళ్లిపోకా.. గొడవలు పెట్టుకుంటే.. ఏమంటారు బలుపు అనకా..? లెజెండ్ సినిమాలో నందమూరి నటసింహం బాలయ్య పక్కన నటించి అందరితో నాలుగు మంచి మాటలు అనిపించుకున్న మరాఠీ అమ్మాయి రాధిక ఆప్టే.. అక్కరలేని బలుపును ప్రదర్శించి తెలుగు సినిమా ప్రియుల నుండి చీత్కారాన్ని ఎదుర్కుంటుంది.
 
లెజెండ్ సినిమా కోసం పనిచేస్తూ మంచి సహకారాన్ని అందించిందని మంచితనంతో బాలయ్య బాబు రాధిక ఆప్టే కు లయన్ సినిమాలో కూడా మంచి పాత్ర ఇస్తే.. ఆ కృతజ్ఞతను కూడా మనసులో పెట్టుకోకుండా నోటికి వచ్చినట్టి మాట్లాడి తెలుగు సినిమా పరిశ్రమ పెద్దల మనసులను భాదపెట్టింది. ఇంతకీ ఆమె ఏమందీ అంటే.. తెలుగు సినిమా జనాలకు హీరోయిన్స్ ను గౌరవించటం రాదు. హీరో గారికి విపరీతమైన గౌరవం ఇస్తూ హీరోయిన్లను అవమానపరుస్తారు. వాళ్ళకి అసలు పద్దతే తెలియదు అని ఒక ఇంటర్వ్యూ లో వాగేసిందంటా..!
 
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న తెలుగు సినిమా ప్రముఖులు అమ్మడి మీద ఫైర్ అయిపోయి.. తెలుగు సినిమాల నుండి ఆమెను బ్యాన్ చెయ్యాలి అని గట్టిగా వాదిస్తున్నారంటా..! కాజల్, సమంతలను అడగండి.. తెలుగు నిర్మాతలు హీరోయిన్స్ ను ఎంత భద్రంగా చూసుకుంటారో చెబుతారు. కనపడి కనపడకుండా ఉండే పాత్రలతో రెండు సినిమాల్లో కనిపించి మమ్మల్ని ఆడిపోసుకుంటావా? ఎంత ధైర్యం నీకు..? మరో తెలుగు సినిమా చేయనిస్తామేమో చూడు నిన్ను అని రెచ్చిపోతున్నారు.. కొంతమంది డైరెక్ట్ గా ఆమెకే వార్నింగ్లు ఇస్తున్నారు. కానీ ఇక్కడ కొసమెరుపు ఏమంటే..  ' ఇంత అవమానం జరిగిన చోట నేను పనిచేయను.. మళ్లీ తెలుగు సినిమాలో నేను నటించను' అని రాధిక ఆప్టే స్టేట్మెంట్ ఇవ్వటం..!