బెల్లంకొండ మీద దాడి..!

25 Apr 2015

తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి వివాదం అనే మాట వినపడగానే.. గుర్తుకొచ్చే.. నాలుగైదు పేర్లలో బెల్లంకొండ సురేష్ పేరుకూడా ఉంటుంది. వివాదాలకు సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా ఉండే.. సురేష్ తాజాగా మరో వివాదం కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. పొతే ఈ వివాదం సినిమా విషయంగా కాకపోవటం విశేషం.
 
ఈ రోజు ఉదయం బెల్లంకొండ సురేష్ కార్ డ్రైవర్.. ఒక యాక్సిడెంట్ చేశాడు. ఒక వ్యక్తికి తీవ్రంగా గాయాలు తగిలయని సమాచారం. యాక్సిడెంట్ తరవాత డ్రైవర్ అక్కడి నుండ పారిపోయినట్టు తెలుస్తుంది. దాంతో ఆగ్రహించిన బాధితుడి బంధువులు పెద్ద సంఖ్యలో బెల్లంకొండ ఆఫీసు పై దాడికి వచ్చారు. అక్కడ బెల్లంకొండ సిబ్బందికి, వారికి మధ్య గొడవ పెరిగి ఆఫీసు పై దాడి చేశారని తెలుస్తుంది. కాస్తా అత్యుత్సాహం ప్రదర్శించి కొంతమంది బెల్లంకొండ మీద కూడా దాడి చేసినట్టు చెబుతున్నారు.
 
ఈ విషయంగా వెంటనే అలెర్ట్ అయిన బెల్లంకొండ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వాళ్ళు ఎంటర్ అయ్యి ఆందోళన చేస్తున్న వాళ్ళను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అవతలి వాళ్ళు కూడా బెల్లంకొండ పై కేస్ పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సమస్యలతో సతమతం అవుతున్న బెల్లంకొండ కొత్త సమస్యతో ఎలా వెగుతారో.. చూడాలి.