బెల్లంకొండ దెబ్బ.. ఎవరికైనా అబ్బా..!

17 Apr 2015

రెబెల్ స్టార్ అని పొరపాటున ప్రభాస్ కు బిరుదు ఇచ్చారు కాని.. మెగా పవర్ రెబెల్ స్టార్ అని బెల్లంకొండను పిలుచుకోవాలి తెలుగు సినిమా పరిశ్రమ. ఏమి చాతుర్యం.. ఏమి చమత్కారం.. ఏమి.. చాణుక్య నీతి ప్రదర్శన...! ఎవరు తూగుతారు.. బెల్లంకొండ తెలివితేటల ముందు...! నిలబడగలరా.. ఎవరైనా బెల్లంకొండ ఎత్తుల తాకిడికి తట్టుకుని..!
 
కొడుకు పరిచయ సినిమా కోసం 35 కోట్లు ఖర్చు పెట్టి.. పరిశ్రమలో ఉన్న బడా.. బడా మనుషులకే అర్ధం కాకుండా పోయాడు. ఆ ప్రయోగం వల్ల అపులైతే.. అయ్యుండొచ్చు.. కాని పేరు ఎవరికి దక్కింది. కొడుకు సినిమా మూలంగా అప్పులే కాదు.. బోల్డన్ని కష్టాలు కూడా మోస్తున్నాడు బెల్లంకొండ. అందులో బాగమే బోయపాటి శ్రీనుతో సినిమా మొదలుపెట్టి ఆపేయటం. ఇలాంటి పరిస్థితిలో బెల్లంకొండ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఇపుదప్పుడే వస్తాడని ఎవరు అనుకోలేదు.
 
కాని లారెన్స్ 'గంగ' సినిమాతో అందరి అంచనాలు పేల్చేశాడు. గంగ తెలుగు హక్కులు బెల్లంకొండ దగ్గరే ఉన్నాయి. తమిలో సినిమా విడుదల అయిపోతుంది. తెలుగులో బెల్లంకొండ చెయ్యాలి అంటే అప్పులు కొంతైన కట్టాలి. అలాంటి పరిస్థితుల్లో బ్రెయిన్ కు పనిచెప్పిన బెల్లంకొండ.. స్మార్ట్ గేమ్ ఆడుతూ.. సినిమా విడుదల ఉంటుందో.. లేదో.. అనే అనుమానంలోనే జనాలను ఉంచి.. చాపకిండా నీరులా చక్కబెట్టాల్సిన పనులు చక్కబెట్టి.. అనుకున్న విధంగా సినిమాను విడుదల చేస్తున్నాడు. బెల్లంకొండ చాతుర్యం ముందు..  ఎదురుతిరగాలి అనుకున్న వాళ్ళంతా.. సినిమా విడుదలకు సహకరిస్తున్నారని తెలుస్తుంది. అది మరీ బెల్లంకొండ దెబ్బ.. ఎవరికైనా అబ్బా..!