బండ్ల గణేష్ కు బర్డ్ ఫ్లూ కష్టాలు..!

23 Apr 2015

ఎన్టీఆర్ టెంపర్ సినిమా విజయంతో మంచి కిక్ తెచ్చుకుని.. ప్రస్తుతం అమెరిక పర్యటనను ఎంజాయ్ చేస్తున్న బండ్ల గణేష్ బాబుకు బర్డ్ ఫ్లూ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. తెలంగాణాలో పౌల్ట్రీ వ్యవస్థను విపరీతంగా దెబ్బతీస్తుంది బర్డ్ ఫ్లూ..! తెలంగాణా రాష్ట్రంలో పౌల్ట్రీ అధిపతుల్లో ఒకడైన బండ్ల గణేష్ కు కూడా ఆ సెగ బాగానే తగులుతుంది.
 
ఇటీవల హయత్ నగర్ ప్రాంతంలో ఒక కోళ్ళ ఫారంలో కొన్ని వందల కోళ్ళకు బర్డ్ ఫ్లూ ఉందని తేలటంతో.. వాటిని చంపేశారు. ఆ తరవాత అక్కడే కాదు తెలంగాణలో చాలా ప్రాంతాలలో బర్డ్ ఫ్లూ ప్రభలింది అని వార్తలు రావటంతో కోడి మాంసాన్ని, గుడ్లను కొనటం మానేశారు జనాలు. అంతేకాకుండా తెలంగాణా ప్రాంతం నుండి కోలా ఎగుమతులు కూడా పక్క రాష్ట్రాలు నిలుపుదల చేశాయి. దాంతో ఈ వ్యాపారంతో సంబంధం ఉన్నవాళ్ళందరూ పరిస్థితులను చక్కబెట్టుకునే పనిలో పడ్డారు.
 
అందులో భాగంగానే బండ్ల గణేష్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. బర్డ్ ఫ్లూ మీద అపోహలు వద్దని.. వివిధ రకాలన ప్రచార మార్గాలను ఎంచుకుని ప్రచారం చేస్తున్నాడు. పొతే బండ్ల బాబు ప్రచారాన్ని ఎంత మంది సానుకూలంగా తీసుకుంటున్నారు అన్నది తెలియని విషయం. చూడాలి మరీ తెలంగాణాలో కోళ్ళ వ్యాపారం మళ్లీ ఎప్పటికి లైన్ లో పడుతుందో..?