బండ్ల బాబు మెగా భజన ఇందుకే..!

7 Apr 2015

తెలుగు సినిమాలకు సంబంధించి పక్క ప్రాక్టికల్ ప్రొడ్యూసర్ ఎవరయ్యా అంటే.. తడుముకోకుండా బండ్ల గణేష్ పేరు చేప్పేయవచ్చు..! కాకపోతే ఏంటి చెప్పండి.. స్టార్ హీరోల డేట్స్ ఉంటే చాలు.. రూపాయి లేకుండా సినిమా తీయవచ్చు అని పబ్లిక్ గా చెప్పి.. అందుకోసమే నేను హీరోల భజన చేస్తాను.. అలా చేసే నేను అవకాశాలు తెచ్చుకుంటా అని అర్ధం వచ్చేలా మాట్లాడుతూనే.. పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. బండ్ల గణేష్ భజనలో స్వార్ధం ఉందని తెలిసి కూడా హీరోలు సినిమాలు చేస్తున్నారు అంటే.. అర్ధం చేసుకోవచ్చు.... అతని భజనలో ఎంత మైకం ఉంటుందో.. అని!
 
తాజాగా బండ్ల బాబు మెగాస్టార్ భజన మొదలు పెట్టారు.. అది ఎలా సాగింది అంటే.. "జైచిరంజీవా జగదేకవీరా ఆలస్యమేలయ వెండితెర నీదయా వెలుగు నింపరావయ! ఘరానా మొగుడు కి ఘన స్వాగతం.. రౌడీ అల్లుడుకి సుస్వాగతం.. గాంగ్-లీడర్ కి నిలువెత్తు నీరాజనం!! కష్టించి చిందించే స్వేదం చిరంజీవి. ఇష్టించి ప్రేమించే దైవం చిరంజీవి." . ఈ భజనలో ఉన్న తీవ్రతను చూసి అందరు చిరంజీవి 150వ సినిమాకే గేలం వేస్తున్నాడు అనుకున్నారు.
 
కాని అదేం కాదు.. నాకు అంత ఆశలేదు.. చిరంజీవి గారి 150 సినిమా త్వరగా చూడాలి అనిమాత్రమే అనుకుంటున్నా.. అని వివరణ ఇచ్చాడు. కాని ఏదైనా అవసరం కోసమే హడావిడి చేయటం బండ్ల బాబు స్టైల్.. ఉరకనే ఏ పని చేయడే..? ఇందులో ఏదో మర్మం ఉండే ఉంటుంది అని చాలా మంది అనుమానాలు వ్యక్త చేశారు. ఇప్పుడు ఆ అనుమానాలు నిజమనే అనిపిస్తున్నాయి...! బండ్ల బాబు రామ్ చరణ్ ను ప్రసన్నం చేసుకోవటం కోసమే.. చిరంజీవి దండకం అందుకున్నాడని.. దాని ఫలితంగా త్వరలోనే చెర్రి కరుణించి గణేష్ తో సినిమా చేయబోతున్నాడని ఫిలిం నగర్ లో వార్తలు వినపడుతున్నాయి.