బాలయ్యను నమ్మటంలేదు..!

21 Apr 2015

రికార్డులు తిరగరాసిన బాలయ్యే.. డిజాస్టర్స్ కొట్టినా బాలయ్యే.. చరిత్ర సృష్టించే హిట్టయిన బాలయ్యే.. చెత్త ప్లాప్ అయినా బాలయ్యే.. ! బాలయ్యకు ఇండస్ట్రీ రికార్డులు కొట్టటము వచ్చు... భీభత్సమైన ప్లాపులు ఇవ్వటము తెలుసు. ముఖ్యంగా ఒక బ్లాక్ బాస్టర్ ఇచ్చాడు అంటే.. వెంటనే ఒక డిజాస్టర్ ఇవ్వటం బాలయ్యకు అలవాటు.. ! మొన్ననే ఒక బ్లాక్ బాస్టర్ అయ్యింది.. ఇప్పుడు డిజాస్టర్ బాకి..!
 
ఇటివల సింహ సూపర్ హిట్ తరవాత పరమవీరచక్ర ఇచ్చిన ఘనత బాలయ్యది. ఆ తరవాత కూడా మరో.. మంచి సినిమా పడలేదు.. ! ఇప్పుడు లెజెండ్ తో బాలయ్య ఒక సూపర్ హిట్ ఇచ్చి ఉన్నాడు. అంటే.. సెంటి మెంట్ ప్రకారం లయన్ అడకత్తెరలో ఉన్నట్టే..! ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే పంపిణిదారులు.. బాలయ్య నిర్మాతకు దొరక్కుండా తిరుగుతున్నరంటా..! వస్తున్న ముగ్గురు నలుగురు.. చాలా తక్కువ రెట్లు చెబుతున్నరంటా..!
 
ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక నిర్మాత తలపట్టుకు కూర్చున్నాడు అంటా..! పంపిణి దారులు ఇలానే వ్యవహరిస్తే.. నిర్మాత నష్టానికి విడుదల చేసుకోవాలి. అందుకని కొంచెం ఆగి చూసి సినిమాను బయటకు తీసుకువస్తే.. బాగుంటుంది అని నిర్మాత ఆలోచిస్తున్నాడని సమాచారం. దాని వల్ల మే 1 న వస్తుంది అనుకున్న 'లయన్' మే 7కు వాయిదా పడే అవకాశాన్ని కొట్టిపారేయలేం.. అంటున్నారు.