బాలయ్య రచ్చ రంబోలా..!Balayya dialouges, nandamuri bala krishna

10 Apr 2015

నందమూరి నటసింహం బాలయ్య బాబు.. సినిమాలో డైలాగులు చెబితే.. ఓ కిక్కు..! అదే  సింహం స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇస్తుంటే.. అది యమా కిక్కు..! బాలయ్య ప్రసంగిస్తుంటే.. ఆ దమ్ము..  దర్పాన్ని వర్ణించటం మాములు మానవులు  చేతకాదు. లయన్ చిత్ర ఆడియో విడుదల సందర్భాన్ని పురస్కరించుకుని బాలయ్య చేసిన రచ్చ రంబోలా..! అంతా.. ఇంతా కాదు..!
 
ఉగాది పంచాంగ శ్రవణంతో మొదలుపెట్టి.. రాజకీయాల గురించి.. తెలుగు వాళ్ళ గురించి.. యుగపురుషుడు NTR గురించి.. మాట్లాడి ఆ పై సినిమాల గురించి.. తన రికార్డుల గురుంచి.. లయన్ సినిమా చేయబోయే సంచలనాలు చెబుతూ.. కొన్ని డైలాగులు వదిలి.. డబిది దిబిడి చేసిన బాలయ్య ప్రసంగం ఆయన అభిమానులనే కాదు.. మాములు ప్రేక్షకులను కూడా అమితంగా సంతోషపెట్టిందనిచెప్పటానికి ఎటువంటి మొహమాటము పడనక్కరలేదు. అందరు కూడా ఈ ప్రసంగాన్ని యూ ట్యూబ్ లో మళ్లీ మళ్లీ పెట్టుకు చూస్తారు...  అంత ఎంటర్ టైనింగ్ గా ఉంది బాలయ్య స్పీచ్..!
 
బాలయ్య వీరభద్ర సినిమాలో ఒక డైలాగ్ ఉంది... నేను నరకటం మొదలుపెడితే.. ఏ ముక్క ఎవరిదో.. తెలుసుకోవటానికి వారం పట్టిద్ది.. అని! ఇప్పుడు బాలయ్య చేసిన ప్రసంగానికి ఆ డైలాగ్ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే.. బాలయ్య మాట్లాడటం ఒకచోట మొదలుపెట్టి.. అక్కడినుండి ఎక్కడికో.. అ పైన ఇంకెక్కడికో.. ఆ పైన ఎటెటో.. అటు.. ఇటు వెళ్లి.. ఆ తరవాత ఎక్కడో ఆపుతారు. మొత్తం అయ్యాకా.. ఈయన ఎవరి గురించి ఏమి మాట్లాడారు అని తెలుసుకోవాలి అంటే.. ఓ పట్టానా తెమలటం కష్టం. ఇంత కష్టం ఉన్నప్పటికీ బాలయ్య మాట్లాడుతుంటే.. ఉండే ఎంటర్ టైన్మెంటే వేరు..! అది చెబితే చాలా బాగోదు.. వింటేనే మజా..!