అవును పూర్ణ అత్యాశ..!

12 Apr 2015

కలలు కనటానికి.. ఆశలు పెట్టుకోవటానికి ఓ పరిమితి..  పద్దతి ఉంటే.. చాలా బాగుంటుంది. ఫ్రీనే కదా అని ఇష్టానికి కలలు కనేస్తే.. ఖర్చులేదు కదా అని బోల్డన్ని ఆశలు పెట్టేసుకుంటే.. అన్నివేళలా అనుకున్నట్టు జరగదు.. కొన్నిసార్లు ఊహించని ట్విస్ట్ల తో దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం అవును పాపా పూర్ణ పరిస్థితి కూడా అలానే ఉంది.
 
అవును సినిమాతో మంచి క్రేజ్ సంపాయించుకుంది పూర్ణ. కాని ఆ సినిమా తరవాత ఒక్క సరైన సినిమా కూడా పడలేదు. అవును పార్ట్ 2 నే ఆవిడకు శరణ్యం అయ్యింది. కాని ఈ మధ్యలో ఒక చిత్రం జరిగింది. ఏమంటే.. ఏ  దేవుడకు మొక్కుకుందో.. కాని ఊహించని విధంగా మహేష్ బాబు, కొరటాల శివ సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చింది. ఎగిరి గంతేసి ఆ పాట చేసేసింది. ఎందుకలా ముందు వెనుక ఆలోచించకుండా ఆ పాట చేసావ్ అని ఎవరైన అడిగితే.. 'ఆగడు'  సినిమాలో శృతి హసన్ ఐటెం సాంగ్ చేసింది.. ఇప్పుడు హీరోయిన్ గా చేయటం లేదు. రేపు నాకు మహేష్ పక్కన నటించే అవకాశం రావచ్చు అని బీరలు పోయింది.
 
కాని అమ్మడు ఒకటి అనుకుంటే.. ఇంకోటి అవటం మొదలు పెట్టింది.. మహేష్ తో నటించటం సంగతేమో కాని.. ఇప్పుడు అందరు హీరోయిన్ గా చేస్తావా అని అడగటం మానేసి.. ఐటెం సాంగ్ చేస్తావా..? అని అడగటం స్టార్ట్ చేశారంటా..! దాంతో పూర్ణ దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యి ఏమిచేయాలిరా దేవుడా అని తలపట్టుకు కూర్చుంది.