'అవును' పాపా కాపాడేసింది..!

7 Apr 2015

గత శుక్రవారం విడుదల అయ్యింది 'అవును 2'. ఈ సినిమా గతంలో వచ్చిన అవును సినిమాకు కొనసాగింపు..! అవును 2 ను చూసి పెద్ద పెద్ద విశ్లేషకులు..ఏముంది ఈ సినిమాలో.. అవును పార్ట్ 1 చూసినట్టే ఉంది.. అబ్బెబే.. ఏమిటి సినిమా అని విరుచుకుపడిపోయారు..! కాని చిత్రంగా ప్రేక్షకులు ఈ సినిమాకు మంచి కలక్షన్లతో హారతి పడుతున్నారు..!
 
అవును 2 కలిసి వచ్చిన సెలవులను ఉపయోగించుకుని.. మొదటి వారాంతంలోనే సినిమా పెట్టుబడిలో 70 శాతాన్ని రాబట్టేసుకుందంటా..! సినిమాకు ఉన్న క్రేజ్ ను బట్టి మిగత ముప్పై శాతాన్ని ఫస్ట్ వీక్ పూర్తయ్యే లోపు వసూలు చేసేస్తుంది. ఆపై ఆడినన్ని రోజులు లాభాలే..! అలానే సాటిలైట్ హక్కుల రూపంలో కూడా మంచి ధర పలికే అవకాశం ఉంది. అలా చూసుకుంటే.. ఈ సినిమా నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టేసినట్టే అని ట్రేడ్ విశ్లేషిస్తుంది.
 
పొతే ఈ సినిమా ఇంతలా పెర్ఫర్మ్ చేయటానికి ఒక కారణం రవి బాబు స్మార్ట్ గా వ్యవహరించి తక్కువ బడ్జెట్ లో సినిమాను తీయటం అయితే.. రెండో కారణం హీరోయిన్ పూర్ణ..! 'అవును' సినిమాను మించి ఈ సినిమాలో హాట్ గా కనిపించింది పూర్ణ. పార్ట్ 2 కాబట్టి హాట్ మేటర్ ను డబుల్ డోస్ చేసి రవి బాబు పూర్ణ మీద తీసిన అన్ని సన్నివేశాలు శృంగార ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. హర్రర్ చిత్రం కాబట్టి భయం వెంటాడుద్ది అనుకోవచ్చు కాని అలా కాకుండా.. సినిమాలో వేడిపుట్టించిన పూర్ణ సినిమా అయిపోయిన తరవాత కూడా వెంటాడుతుంది. దాని మూలంగా సినిమాకు రిపీట్ ప్రేక్షకులు వస్తున్నారు అని కొంతమంది విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఏమైతేనేమి.. అవును 2 ను కూడా పూర్ణ పాపా బ్రతికించేసింది..!