అతనితో సమంతా నాలుగోసారి..!

8 Apr 2015

సమంతా మహా బిజీ గ్లామర్ డాల్.. ఇపుడున్న పరిస్థితుల్లో ఆమెతో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలి అంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలకే .. మహా కష్టం..! ఎందుకంటే.. ఆవిడా కోసం.. క్యూలు అంత దూరం ఉంటాయి మరీ..! అవకాశం ఉన్నవరకు చాలా మంది ఆమెతో నటించాలనే ఉబలాటపడతారు. కాని అదృష్టం చాలా కొద్ది మందికే దక్కుతూ ఉంటుంది.
 
సమంతా ఇప్పటివరకు మళ్లీ..  మళ్లీ.. మళ్లీ.. ఇలా మూడు సార్లు నటించింది ఇద్దరు హీరోలతోనే.. ఒకరు NTR, రెండు నాగచైతన్య..! ఇప్పుడు ఈ రికార్డును కూడా బ్రేక్ చేయనున్నాడు నాగచైతన్య..! తాజాగా అందుతున్న వార్తల ప్రకారం సమంతా నాలుగోసారి చైతన్యతో జోడి కట్టేందుకు సిద్దం అవుతుంది. ఎంతైనా తన తోలి హీరో అని సమంతాకు చై.. మీద అభిమానం లాగుంది.. అందుకనే అతనితో సినిమా అనగానే.. టపీ మని డేట్స్ ఇచ్చేస్తుంది.. మూతి ముద్దులు గట్రా ఉన్నా.. చటుక్కున ఒప్పేసుకుంటుంది.
 
ఈ మధ్యే నిఖిల్ సిద్దార్థ్ తో 'కార్తికేయ' సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు చందూ మొండేటి.. తన తరవాతి చిత్రం నాగచైతన్యతో ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ సినిమాలో సమంతాను హీరోయిన్ గా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబందించిన పూర్తీ వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.