అదా శర్మ అతి..!

21 Apr 2015

అతి అనర్ధం అన్నారు పెద్దలు..! అతి వల్ల అభాసుపాలు కావటమే కాని అందలం ఎక్కే వ్యవహారం లేనే లేదు అన్నది పండితుల మాట..! కాని ఆ మాటలు ఎవరు కూడా హిందీ నుండి ఇక్కడకు దిగుమతై.. తెలుగులో ఉండాలో..   వెళ్ళిపోవాలో.. తెలియక కిందా మీద పడుతున్న హార్ట్ యటాక్ భామ అదా శర్మకు చెప్పినట్టులేరు. ఫలితంగా ఆమె అతితో చిరాకు తెప్పిస్తుంది.
 
హార్ట్ యటాక్ సినిమా మూలంగా పేరంతా నితిన్ కే పోయింది కాని ఆదాకు ఏమి దక్కలేదు. ఫలితంగా బోడి అవకాశాలే కాని ఒక మంచి రోల్ ఇచ్చి పుణ్యం కట్టుకున్న మహానుభావుడు లేడు. దాంతో ఆమె ముంబై తెలివిని అమలులో పెడుతూ ప్రత్యేకంగా ఒక ప్రచార టీమ్ ను ఏర్పాటుచేసుకుంది. వాళ్ళు అదా తుమ్మిన విశేషమే అన్నట్టు ఎన్నో రకాలుగా ఆమెను ప్రచారం చేసే పనిలో పడ్డారు. అదా గురించి అవసరం లేకపోయినా వెబ్ సైట్స్ లో ఆర్టికల్స్ రాయించటం..! సందర్భంలో సంబంధం లేకుండా ఫోటో షూట్ లు ఒకటేమిటి.. 100 వేషాలు..!
 
ఆ క్రమంలోనే తాజగా ఆమె S/O సత్యమూర్తి సినిమా గురించి, అందులో ఆమె పాత్ర గురించి బాగా డప్పు కొట్టుకుంటుంది. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయాల్సిన పాత్రను చేయించి త్రివిక్రమ్ అదా రేంజ్ ను డిసైడ్ చెస్తే.. ఆ సంగతేదో.. మహా గొప్ప విషయం అయినట్టు ప్రచారం చేసుకోవటం ఆమె ప్రచారపు అతికి పరాకాష్ట అంటున్నారు. ఈ అతి తగ్గాలి అంటే.. ఆమెకు ఒక మంచి అవకాశం కావాలి..! ఆ అవకాశం ఇచ్చే దర్శకుడు ఎక్కడున్నాడో మరీ..!