ఆవిడ అందం గురించే టాక్.. !

17 Apr 2015

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా.. ప్రభాస్ 'మిర్చి'తో మంచి విజయాన్ని దక్కించుకున్న కొరటాల శివతో చేస్తున్నాడు అన్న సంగతి తెలిసిందే..! ఆ సినిమాలో కొరటాల బాబు బోల్డంతమంది ఆర్టిస్టులకు రకరకాల పాత్రలు ఇచ్చాడు. కుటుంబకదా చిత్రం కావటంతో.. అంతమంది నటినటులు అవసరం అయ్యారని చిత్ర బృందం వివరణ ఇస్తుంది.
 
పొతే ఈ సినిమాలో మహేష్ బాబు అమ్మనాన్నలుగా జగపతిబాబు, సుకన్య నటిస్తున్నారు. పెద్దరికంలో ఈ జంట మంచి సందడి చేసింది. ఆ తరవాత మళ్లీ మహేష్ కోసమే వీళ్ళు కలిసారు. అక్కడి వరకు బానే ఉంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ మలేసియాలో జరుగుతుంది. అక్కడ సుకన్య ప్రవేట్ గా దిగిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. చూడటానికి అవి సంప్రదాయంగానే ఉన్నాయి. కాని కొంతమంది వాటికి కూడా పెడర్ధాలు తీస్తున్నారు.
 
అరె.. మహేష్ బాబు అమ్మగా నటిస్తుందే అన్న గౌరవం కూడా లేకుండా.. ఇంత వయసొచ్చినా అందం మాత్రం తగ్గలేదు.. పిటపిటలాడుతుంది. మహేష్ అమ్మగా అసలు ఎలా సూట్ అవుతుంది. దర్శకుడు తప్పుగా ఇమెను ఎంచుకున్నాడు. ఈ ఫోటోలలోనే ఇంత అందంగా ఉంది.. సినిమాలో ఎలా ఆదరగోడుతుందో..? అని అభిమానాన్ని చాటుతున్నారో.. వ్యామోహాన్ని చాటుతున్నారో. అర్ధం కాకుండా మాట్లాడుతున్నారు..! ఏమిటో.. ఈ మనుషులు అసలు అర్ధం కారు..