ఆ నలుగురులో బన్ని!

16 Apr 2015

తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి స్టారిజం పిచ్చి మహా జాస్తి..! హీరోకు యాక్టింగ్ వచ్చా.. లేదా అన్నది ఎవడికి అవసరం లేదు. సినిమాకు ఏ రేంజ్ వసూళ్ళు వచ్చాయి అన్నదే.. లెక్క..! ఆ లెక్క ప్రకారమే స్టార్ గిరి కట్టబెట్టేస్తారు. ఆ ప్రకారం ఇప్పుడు తెలుగు సినిమాలకు సంబందించిన టాప్ హీరోలు..  పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్! కాని ఇప్పుడు s/o సత్యమూర్తి  పుణ్యంతో బన్నీ ఎన్టీఆర్ ప్లేస్ ఆక్రమించుకుని ఆ నలుగురులో ఒకడు అనిపించుకునేట్టు కనిపిస్తున్నాడు.
 
'జులాయి' ముందు వరకు స్టార్ హీరో కేటగిరిలోనే ఉన్నప్పటికీ టాప్ లీగ్ కు పోటివస్తాడని ఎవరు అనుకోలేదు. జులాయి హిట్ తో ప్లేస్ మెరుగుపరుచుకున్నాడు. రేసుగుర్రంతో 56 కోట్లు వసూలు చేసినప్పటికీ.. అదృష్టం కలిసోచ్చిందిలే అనుకున్నారు కాని పోటి అనుకోలేదు. కాని s/o సత్యమూర్తి ప్రభంజనంతో టాప్ లీగ్ కు బన్నీ కూడా పోటిపడుతున్నాడని అర్ధం అయిపొయింది. ప్రస్తుతం బన్నీ ఎన్టీఆర్ ను పక్కకు నేట్టేసినట్టే..! టాప్ 4 లో చేరిపోయినా బన్నీ నెక్స్ట్ టార్గెట్ రామ్ చరణ్.
 
s/o సత్యమూర్తి 50 కోట్ల పైన వసూళ్ళు సాధిస్తే.. రామ్ చరణ్ కు కూడా బన్నీ చెక్ పెట్టటం మొదలుపెట్టాడు అని అనుకోవచ్చు. ఎందుకంటే 50 కోట్ల పైన రామ్ చరణ్ కు ఒక్క సినిమానే ఉంది. బన్నీ రెండు సినిమాలతో చెర్రి మీద పై చెయ్యి సాదించినట్టే అవుతుంది. ఇదే రేంజ్ లో అదృష్టం కలిసొస్తే.. అల్లు అర్జున్ నంబర్ వన్ అనిపించుకోవటం పెద్ద కష్టం ఏమికాదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.