బాబు కు చెయ్యిచ్చిన సింగపూర్

28 Mar 2015

కారణాలు ఏమైనా సింగపూర్ మాజీ ప్రధాని అంత్య క్రియల్లో పాల్గొనేందుకు వెళ్ళాలని బాబుగారు తెగ ఉత్సాహ పడ్డారు....ఖజానా నుండి డబ్బు కూడా విడుదలయ్యిందని నిన్న టీవీలలో స్క్రోలింగులు వచ్చాయి...
అలా వెళ్లి ఉంటే బాబు ఆధ్వర్యం లోనే అంత్యక్రియలు ఘనంగా జరిగాయని అను"కుల" తెలుగు మీడియాలో విపరీతమైన ప్రచారం వచ్చేది......
కానీ, కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ వాళ్ళేమో బాబు సింగపూర్ వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు.....
ఇప్పుడే మన అంతరంగిక మేదావి వర్గం అని పిలుచుకొనే పచ్చ మీడియా రంగంలోకి దిగింది....
కేంద్రం లో చక్రం తిప్పేస్తా అని చెప్పుకుతిరిగే బాబుగారికి కేంద్రం అనుమతి నిరాకరణ అంటే....
ఉన్న ఆ కాస్త పరువు గంగలో కలిసిపోదటండీ....(***అసలు ఉంటే కదండీ అంటారా.... అయ్యో రామా నాకన్ని విషయాలు తెలియవండి...***)
అందుకే "బాబుగారి సింగపూర్ పర్యటన వాయిదా..."
అంటూ పొద్దున ఈనాడు, జ్యోతి పేపర్లలో కలరింగూ కవరింగూ ఇచ్చుకున్నారు....!!
ఇంతకీ నా సందేహం...... దీన్ని వాయిదా అనవచ్చా....????
ఒక వేళ పెట్టుబడుల సేకరణ కోసం బాబు సింగపూర్ పర్యటనకు అనుమతి రాకపోతే......
కొద్ది రోజుల తరువాతైనా మల్లి అనుమతి వస్తుంది కాబట్టి వాయిదా అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు.....
అంత్య క్రియల కార్యక్రమానికి వెళ్ళడానికి అనుమతి రాక పోతే దాన్ని వాయిదా అనవచ్చా...????
అంటే బాబు గారు మల్లి ఏదో ఒక రోజు సింగపూర్ వెళితే అప్పుడు మళ్లి సింగపూర్ మాజీ ప్రధాని అంత్య క్రియలు నిర్వహిస్తారా ఏమిటి....????
ఏదిరాసిన పొద్దున్నే గుడ్డీగా కాఫీలు, టీ లు గుటకలు మింగుతూ చదివిపారేరా అని.....
చదివేవాళ్ళ తెలివితేటల మీద వీరికి ఎంత నమ్మకమో....!!!!
సిగ్గులేకుండా.... నెత్తిన పెట్టుకు మోసే మీడియా ఉన్నంతవరకు మన బాబుగారికి డోకానే లేదు....!!!!