TDP మేనిఫెస్టోను జగన్ కంఠస్దం

28 Mar 2015

మా TDP మేనిఫెస్టోను జగన్ కంఠస్దం చేసారు--యనమల !

హహ్హా,,,,ఒక్క జగనే కాదు కఠస్దం చేసింది,,ఈ రాష్ట్ర ప్రజలంతా కంఠస్దం చేసారు బాబయ్యా !

ఎన్నికల సమయం లో బాబుగారు ఒకసారి చెబితే ఈనాడు,ఆంద్రజ్యోతి,TV9 తదితర తమ ఆస్దాన మీడియా చూస్తూనే ఉండండి చూస్తూనే ఉండండి మా బాబుగారు మీ దుమ్ములేపెయ్యబోతున్నారని ఒకటికి పదిమార్లు కోరస్ పాడి వినిపించారు మీ మేనిఫెస్టోని !

ఇంకా కంఠస్దం అవ్వకుండా ఎలా ఉంటుంది యనమల బాబయ్యా !?
ఐనా జగన్ గారు మీ మేనిఫెస్టోని కంఠస్దం చేస్తే మీకెందుకంత ఇబ్బందీ ?

మా బాబుగారు ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను ఎన్నికలయ్యాక ఎప్పుడో మరచిపోతే,,మద్యలో ఈ జగనేంటీ మాకవన్నీ గుర్తుచేసేస్తున్నాడనేగా తమరి బాధ !?
మీ మేనిఫెస్టోలో చివరన ఎన్నికలయ్యాక "షరతులు వర్తిస్తాయి"అని ఒక ముక్క చేర్చిన సంగతిని జనమిప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు మరి !