నీ హామీలపై నిలదీస్తే ఇలా పారిపోతావని ఊహించలేకపోయాం..పెద్దకొడుకా !

28 Mar 2015

ఈతకాయిచ్చి తాటికాయ గుంజుకుంటావనుకోలేదు పెద్దకొడుకా !
సంక్రాంతికానుకల పేరుతో శెనగలు చేతికిచ్చి సర్ చార్జీలు మా నెత్తిన వేస్తావని ఊహించుకోలేదు పెద్దకొడుకా !
కందిపప్పు చేతికిచ్చి కరెంటు చార్జీలతో మమ్మల్ని బాదేస్తావని ఊహించలేదు పెద్ద కొడుకా !
పామాయిల్ చేతికిచ్చి మా పంటపొలాలను గుంజుకుంటావని ఊహించలేదు పెద్ద కొడుకా !
నెయ్యి చేతిలో పెట్టి మా ఋణమాఫీకి మొండిచెయ్యిస్తావని ఊహించలేదు పెద్దకొడుకా !
బియ్యం చేతిలో పెట్టి వ్యాట్ పోటు పొడుస్తావని మేము ఊహించలేదు పెద్దకొడుకా !
గోధుమ పిండి చేతిలో పెట్టి మా గోచీని లాగేస్తావని ఊహించలేదు పెద్దకొడుకా !
ఎన్నికలముందు మారిపోయానని చెప్పి,,,ఎన్నికలయ్యాక నీ హామీలపై నిలదీస్తే ఇలా పారిపోతావని ఊహించలేకపోయాం పెద్దకొడుకా !