చంద్రబాబు..ఏదైనా మాట్లాడే ముందు విషయం తెలుసుకుని మాట్లాడాలి

28 Mar 2015

ఆ మధ్యన చంద్రబాబు గోదావరిజిల్లాల పర్యటనలో....... మరణాలరేటు తగ్గిపోయింది..... కనుక ఎక్కువమంది పిల్లలను కనమని సలహా ఇచ్చాడు........ చంద్రబాబు చెప్పిన కారణం..... చైనా, జపాన్ దేశాలు కూడా ఇటువంటి పిలుపే ఇస్తున్నాయి, వారు మేల్కొన్నట్లే మనం మేల్కోవాలి అని..... అది పూర్తిగా తప్పు........ కానీ దురద్రుష్టమేమిటీ అంటే చదువుకున్నవాళ్ళు, సో కాల్ డ్ మేధావులు కూడా చంద్రబాబు చెప్పేడు కాబట్టి అదే నిజం అంటూ కామెంట్ లు...... మీకు చంద్రబాబు దేవుడయితే పూజించుకోండి......అది మీ వ్యక్తిగతం....... కానీ గుడ్డిగా తప్పులను సమర్ధించకండి..... జాతీయ సంస్థల లెక్కలు తెలుసుకోండి......ఇది సామాజిక అవసరం.....!!! చంద్రబాబు ఒక బాధ్యతాయుతమైన పదవిలో వున్న వ్యక్తి....... ఏదైనా మాట్లాడే ముందు విషయం తెలుసుకుని మాట్లాడాలి....... లేకపోతే ఏమాత్రం సంస్కారం వుంటే తప్పు సవరించుకోవాలి....... మన INDIA లో CBR 24 [జననాల రేటు]....... & CDR 9 [మరణాలరేటు]... అదే మన AP CBR19 [జననాల రేటు]..... & CDR 8 [మరణాలరేటు] మన రాష్ట్రం లో జననాల రేటు ఎప్పుడు పెంచాలి....???? చంద్రబాబు చెప్పినట్లుగా సింగపూర్ లాగా, జపాన్ లాగా.... మరణాలరేటు కన్నా జననాల రేటు తగ్గిపొయినపుడు.... అంటే..... CBR 5 & CDR 6-8 వుంటేనే ఎక్కువమంది పిల్లలను కనమని సలహా ఇవ్వాలి..... అలా పిలుపు ఇచ్చే ముందు, పుట్టిన 5 ఏళ్లకే సరైన వైద్యసౌకర్యం లేక చనిపోతున్న పసిపిల్లల్ని ఎలా బతికించుకోవాలి....???? కనీస వైద్యసౌకర్యాలు ప్రతి గ్రామానికి ఎలా అందించాలి....???? పిల్లలకు పోష్టికహారం ఎలా ఇవ్వాలి.....???? ప్రతి సంవత్సరం మరణిస్తున్న గర్భిణి స్త్రీల సంఖ్యను ఎలా తగ్గించాలి....??? అని ఆలోచించి....తగిన ప్రణాలికలు రచించి వాటిని పక్కాగా అమలుపరిచి...... ఆ మరణాల సంఖ్యని మిగతా దేశాల స్థాయికి తగ్గించిన తర్వాత ఆ పిలుపు ఇచ్చి ఉంటే బాగుండేది... 2013 వ సంవత్సర లెక్కల ప్రకారం పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో 5 ఏళ్ల లోపు మరణిస్తున్న వారి సంఖ్య: అమెరికా --> 7, చైనా --> 13, జపాన్ --> 3, సింగపూర్ --> 3 ఇండియా --> 53 ఇక్కడ అందరూ మరిచిపోయింది మరొకటి ఉంది..... ప్రతి సంవత్సరం సుమారు 56,000 మంది గర్భిణి స్త్రీలు మన దేశంలో మరణిస్తున్నారు..... ఇది కూడా చైనా, జపాన్ కన్నా చాలా చాలా ఎక్కువ...... ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్పండి.... ప్రజలు పిల్లల్ని కనాలా, లేక మీరు అందరికి నాణ్యమైన వైద్యం అందించాలా....??? ఏది ముందు....???