రక్తం యివ్వాలనుకున్నా ఇవ్వలేక నిరుత్సాహ పడిన అమ్మాయిలు ...

28 Mar 2015


యీరోజు వో.టీ. ఐ లో జరిగిన రక్తదాన శిబిరములో ఎందరో అమ్మాయిలు రక్తం యివ్వాలనుకున్నారు. కానీ వారికి హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉండడం వల్ల రక్తం తీసుకోవడానికి నిరాకరించారు బ్లడ్ బ్యాక్ డాక్టర్. ప్రతి కాలేజీలలో యిదే పరిస్థితి.యేదో కొద్దిమంది మాత్రం యివ్వగాలుగుతారు.

అందుకే "అమ్మాయిలు ఆకుకూరలు బాగాతినాలి , కేవలం డ్రెస్సింగ్ టేబుల్ ముందే కాకుండా డైనింగ్ టేబుల్ ముందు కూడా కుచ్చోండి , అద్దం ముందే కాదు అన్నం ముందుకూడా కుచ్చోండి .అంతే కాకుండా వొక్కపొద్దులతో కడుపు మాడ్చుకోకండి ,వుండేదే బక్కగా , తినేదే వొక్క ముద్ద దానికి తోడు వొక్కపొద్దు వల్ల మీఆరోగ్యం పాడైపోతుంది , యిప్పుడు మీరు యివ్వకపోయినా ఫరవాలేదు మీకుటుంబ సభ్యులను రక్తదాతలుగా చైతన్యం చెయ్యండి " అని నేను చెప్తుంటా ..

అసలు ఆడవాల్లల్లోనే రక్తహీనత ఎక్కువ, నెల నెలా బహిష్టు వల్ల రక్తం పోవడం వొక కారణం అయితే వాళ్ళు తినేదే తక్కువ, వండేదివాల్లే,వడ్డిచ్చేది వాల్లే, యింట్లో అందరికీ పెడతారు , మిగిలితే తింటారు,లేకపోతే నీళ్ళతో కడుపు నింపుకుంటారు . యిక పేదవాళ్ళకు పేదరికమే పెద్ద జబ్బు అయితే కుటుంబ నియంత్రణ చేసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందని అనారోగ్యంగనే యేటా వొకరిని కంటారు , అసలు వాళ్ళ కడుపులు చూస్తే కనేదానికే కానీ తినేందుకు కాదనిపిస్తుంది. యిదీ మన ఆడవాళ్ళ పరిస్థితి. యీపరిస్థితి పోవాలంటే సరయిన పోషక ఆహారం తీసుకోవాలి.